న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ విమానంలో తాగుబోతు వీరంగం..మహిళపై మూత్రం పోసి..
- September 01, 2018
న్యూఢిల్లీ:ఎయిరిండియా విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలి పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించాడు. ఆమె ముందే ప్యాంటు విప్పి మూత్రం పోస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. శుక్రవారం న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై హతాశురాలైన బాధితురాలి కుమార్తె ట్విటర్ వేదికగా ఎయిరిండియాను నిలదీసింది. ''శుక్రవారం జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బయల్దేరిన మీ విమానం ఏఐ102లో మా అమ్మకు దారుణ అనుభవం ఎదురైంది. మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు తన ప్యాంటు విప్పి ఆమె కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు! ఒంటరిగా ప్రయాణిస్తున్న మా అమ్మ ఇది చూసి నిశ్చేష్టురాలైపోయింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా సమాధానం చెబుతారని ఆశిస్తున్నాను...'' అని ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారం కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి వెళ్లడంతో వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ''దీనిపై సత్వరమే విచారణ చేపట్టి విమానయాన శాఖ, డీజీసీఏకి నివేదిక సమర్పించాలని ఆదేశించాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితి మీ తల్లిగారికి ఎదురవడం చాలా దురదృష్టకరం..'' అని సిన్హా పేర్కొన్నారు. దీంతో ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఎయిరిండియా హుటాహుటిన విచారణ ప్రారంభించినట్టు సమాచారం.
కాగా తాను ఎయిరిండియాకి కంప్లయింట్ చేసేందుకు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. వెబ్సైట్లో ఫీడ్ బ్యాక్ రాయాలంటూ సందేశం వచ్చిందని బాధితురాలి కుమార్తె వాపోయారు. ''ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్లు మరింత రెచ్చిపోతారని మీకు తెలియదా? ఈ అసహ్యకరమైన పనులపై సదరు విమాన సంస్థకు ఫిర్యాదు చేస్తే ముందు ముందు మళ్లీ ఇలాంటివి జరగకుండా అడ్డుకోవచ్చు..'' అంటూ బాధితురాలి కుమార్తె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







