అసెంబ్లీ లో చంద్రబాబు పై జగన్ తీవ్ర ఆరోపణలు
- December 17, 2015
ఆడవారి మానప్రాణాలతో టిడిపి నేతలు చెలగాటమాడి వీడియోలుగా తీశారని వైసిపి అధినేత జగన్ గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. శాసన సభ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కాల్ మనీ-సెక్స్ రాకెట్కు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటమాడి వీడియోలు తీసిన వారిని చంద్రబాబు కాపాడుతున్నారన్నారు. ఆయన ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ నిందితులతో కలిసి టిడిపి ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లాడన్నారు. ఎమ్మెల్యే తిరిగొచ్చినా పోలీసులు విచారించలేదన్నారు. కాల్ మనీ నిందితులతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డిజిలు ఫోటోలు దిగారన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సొంత తమ్ముడే ఈ కేసులో నిందితుడు అన్నారు. సోదరుడితో కలిసి ఇంట్లో ఉంటున్నప్పటికీ బుద్ధా వెంకన్న తనకు ఏమీ తెలియదని చెప్పడం విడ్డూరమన్నారు. ఇంత జరుగుతున్నా టిడిపి నేతల పైన కేసులు ఉండవని, విచారణ జరగదన్నారు. సెక్స్ రాకెట్ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, దీనిని ప్రశ్నించవద్దా అన్నారు. కాల్ మనీ - సెక్స్రాకెట్ ముఠాను నీరుగార్చేందుకే వడ్డీ వ్యాపారుల పైన దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఇంత దారుణమైన ముఖ్యమంత్రి దేశంలోనే లేరన్నారు. చంద్రబాబుకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదన్నారు. బిఏసీలో చర్చ విషయంలో తమ పైన అబద్దాలు చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు హఠాత్తుగా అంబేడ్కర్ ఎందుకు గుర్తుకు వచ్చాడన్నారు. అంబేడ్కర్ను రాజకీయాలకు వాడుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సస్పెండ్ చేయాలని మంత్రి చెబితే, స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారన్నారు. ఇంతటి దుర్మార్గపు, దుశ్సాసన, కౌరవ సభను ఇంత వరకు చూడలేదన్నారు. కాల్ మనీ కేసులో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. మా వైఖరిని బిఏసీలో స్పష్టంగా చెప్పినా అబద్దాలు ఆడుతున్నారన్నారు. రిషికేశ్వరి, వనజాక్షి కేసుల్లో ఒక్కర్నీ చంద్రబాబు నిలదీసిన పాపాన పోలేదన్నారు. ఇసుక మాఫియా, కాల్ మనీ, సెక్స్ రాకెట్ తదితరాల్లో చంద్రబాబుకూ భాగం ఉందన్నారు. చంద్రబాబును కాల్ బాబు, మనీ బాబు, సెక్స్ రాకెట్ బాబు అని కూడా పిలవవచ్చునని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







