జబర్దస్త్ హాస్య నటుడి సుధాకర్ కి గౌరవ 'డాక్టరేట్'
- September 03, 2018
పాలమూరు ముద్దుబిడ్డ ప్రముఖ టెలివిజన్ షో జబర్దస్త్ లో హాస్య నటుడు గాలిపటాల సుధాకర్ కు గౌరవ డాక్టరేట్ లభించింది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కళారంగంలో సుమారు 5వేల స్టేజీ ప్రదర్శనలు ఇచ్చినందుకు గాను తమిళనాడు రాష్ట్రానికి చెందిన కోయంబత్తూర్ రాయల్ అకాడమి ఆర్ట్స్ యూనివర్సిటీ సుధాకర్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
జబర్దస్త్ టెలివిజన్ షోలో హాస్య నటుడిగా అందరికి సుపరిచితుడైన సుధాకర్ కు ఈ నెల 8వ తారీఖున దుబాయ్ లో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ ను ప్రధానం చేయనున్నారని కోయంబత్తూర్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.. దీనితో పాలమూరు జిల్లాకు చెందిన పలువురు కళాకారులతో పాటుగా జబర్దస్త్ టీం సహనటులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







