'ఎన్టీఆర్' బయోపిక్‌లో నటించనున్న మెగా హీరో
- September 03, 2018
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటుడు స్వర్గీయ నందమూరి తారక రామరావు జీవిత కథను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఆయన తనయుడు బాలకృష్ట నటీస్తు,నిర్మిస్తున్నారు.దర్శకుడు క్రిష్ ఈ సినిమా బాధ్యతలు చెపట్టిన దగ్గర నుంచి ఈ బయోపిక్‌పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.కొన్ని రోజులపాటు ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను, హైదరాబాద్ - అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో చిత్రీకరించారు.
తదుపరి షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో 'నాగబాబు'ను తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పాత్రకి నాగబాబు సరిగ్గా సరిపోతారనీ క్రిష్ భావిస్తున్నాడట.మరి దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుండగా, జయప్రద పాత్రలో రాశిఖన్నా వార్తలు వినబడుతున్నాయి.మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







