హెచ్1బీ, ఎల్1 వీసాలపై స్పెషల్ ఫీజును భారీ పెంపు
- December 17, 2015
హెచ్1బీ, ఎల్1 వీసాలపై రూ. 3 లక్షల ప్రత్యేక ఫీజు విధించిన అమెరికా పదేళ్ల పాటు అమలు! * భారత కంపెనీలపై ఏటా రూ. 10 వేల కోట్ల భారం వాషింగ్టన్: అమెరికాకు ఉద్యోగులను తీసుకెళ్లే భారత ఐటీ సంస్థలే లక్ష్యంగా ఆ దేశం హెచ్1బీ, ఎల్1 వీసాలపై స్పెషల్ ఫీజును భారీగా పెంచింది. హెచ్1బీ వీసాపై సుమారు రూ. 2.6 లక్షలు(4,000 డాలర్లు), ఎల్1 వీసాపై దాదాపు రూ. 3.2 లక్షలు(4,500 వేల డాలర్లు) ప్రత్యేక ఫీజు విధిస్తూ అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఫీజు.. 50 మందికిపైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో సగం మందికిపైగా హెచ్1బీ, ఎల్1 వీసాలు ఉన్న ఉద్యోగులు ఉంటే వర్తిస్తుంది. ఈ లెక్కన అమెరికాలోని భారత ఐటీ కంపెనీలన్నీ ఈ నిబంధన కిందకు వస్తాయి. 2010 నుంచి 2015 వరకు ఒక్కో వీసాపై వసూలు చేసిన ఈ ప్రత్యేక ఫీజు దాదాపు రూ. 1.3 లక్షలే కావడం గమనార్హం. నాస్కామ్ అంచనా ప్రకారం భారత ఐటీ కంపెనీలు ఇప్పటివరకు అమెరికాకు ఏటా సుమారు రూ. 5వేల కోట్లు చెల్లిస్తున్నాయి. తాజా పెంపుతో ఏటా రూ. 10 వేల కోట్లకు పైగా కట్టాల్సిరావచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







