ఏయం జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా

- December 17, 2015 , by Maagulf
ఏయం జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా

జిల్'తో హిట్ పెయిర్ అనిపించుకున్న గోపీచంద్, రాశీ ఖన్నా మళ్లీ జతకట్టిన చిత్రం 'ఆక్సిజన్'. ఏయమ్ రత్నం పెద్ద కుమారుడు ఏయం జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం చెన్నైలో జరిగాయి. ఇందులో జగపతిబాబు కీలక పాత్ర చేయనున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ అనీ, జగపతిబాబుది పాజిటివ్ రోల్ అనీ చిత్రబృందం తెలిపింది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు. 'కిక్' శ్యామ్, అనూ ఇమ్మాన్యుయెల్, అలీ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: వెట్రి, సూపర్‌విజన్: ఏఎమ్ రత్నం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com