ఇటలీలో ఘనంగా ఇషా అంబానీ నిశ్చితార్థం
- September 23, 2018
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాళ్ గ్రూప్ చీఫ్ అజయ్ పిరమాళ్ కుమారుడు ఆనంద్ నిశ్చితార్థం జరిగింది. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో ఉన్న లేక్ కొమోలో ఆనంద్‌తో ఇషా నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగిందని నివేదికలు తెలిపాయి.
ఈ వేడుకకు అనిల్ కపూర్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, ఆమె కాబోయే భర్త నిక్ జోనస్, కరణ్ జోహార్, డిజైనర్ మనీష్ మల్హోత్రా, శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు వీరేగాక పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోల ద్వారా తెలుస్తోంది. కాగా అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా అతిథులకు లేక్ కొమోలో పార్టీ ఇవ్వనుందని సమాచారం.
డిసెంబర్‌లో ఇషా-ఆనంద్ వివాహం జరగనుంది. ఈ ఏడాది మే నెలలో ఆనంద్ తన చిన్ననాటి స్నేహితురాలు ఇషాకు మహాబలేశ్వర్‌లో ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఇరు కుటుంబాలు లంచ్ పార్టీలో పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







