'బిల్డప్ కృష్ణ' టీజర్ విడుదల
- September 24, 2018
శ్రావ్య మూవీస్ బ్యానర్‌లో లక్ష్మీ టాకీస్ సమర్పణలో సరీష్, గీత హీరోహీరోయిన్లుగా పోసాని కృష్ణమురళీ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'బిల్డప్ కృష్ణ'. విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళీ మాట్లాడుతూ..''బిల్డప్ కృష్ణ. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో చేశా. అప్పట్లో ఐదారు ఫ్యామిలీల మధ్యలో కీ పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో.. ఈ సినిమాలో నాది అలాంటి పాత్ర. చాలా కాలం తర్వాత చాలా మంచి పాత్ర వచ్చింది. రెండు కుటుంబాలను ఎలా విడదీయాలి? లేదంటే ఎలా కలపాలి వంటి పాత్రలు మారుతీరావుగారు చేశారు. దర్శకుడు విన్సెంట్ ఇప్పుడు అలాంటి పాత్ర నాకు ఈ సినిమాలో ఇచ్చారు. రైటర్‌గా ఉన్నప్పుడు కూడా నాకు నేను రాసుకోలేకపోయా. ఎవరికీ ఇలాంటి పాత్ర రాయలేకపోయా. ఈ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడిగారే కనబడతారు. నా పాత్రకి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే టైటిల్ కూడా 'బిల్డప్ కృష్ణ' అని పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశాను. నవ్వించాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాను. కానీ ఇందులో ట్రాజెడీ తరహాలో పెద్దపెద్దగా ఏడ్చే పాత్రలో చేశా. ఈ సినిమాలో ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి. ఆ సీన్లు చూసిన తర్వాత నాకు నేనే కన్నీళ్లు పెట్టుకున్నా. ఈ సినిమా చూసేటప్పుడు మీకు కూడా కన్నీళ్లు వస్తాయి. అంత మంచి సీన్స్ నాకు డైరెక్టర్‌గారు ఈ సినిమాలో ఇచ్చారు. నాలో ఎంత దమ్ము ఉంది అనేది ఈ సినిమాలో చూపించే అవకాశం ఇచ్చాడు. నా పాత్రే కాదు.. సినిమా కథ కూడా ప్రాక్టికల్‌గా, సహజంగా, లవ్‌బుల్‌గా ఉంటుంది. ఒక మగాడు తప్పు చేయడానికి ఈ సొసైటీలో ఎలాంటి వాతావరణం ఉందో.. అలాగే ఓ ఆడది రాంగ్ రూట్‌లో వెళ్లడానికి ఈ సొసైటీలో ఉన్న కారణాలను చాలా సహజంగా ఇందులో చూపించారు. ఒక రైటర్‌గా నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. అందుకే ఇలా చెప్పగలుగుతున్నా. నేను ప్రేమించి ఈ సినిమా చేశా. నాకు చాలా మంచి పేరు వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా. అందుకే ప్రెస్‌మీట్ కూడా మా ఇంటిలోనే పెట్టమని చెప్పా.. అందరూ ఈ సినిమా చూడండి. కొత్త పోసానిని చూస్తారు.. '' అని అన్నారు.
డైరెక్టర్ విన్సెంట్ సెల్వ మాట్లాడుతూ..''సినిమా చాలా బాగా వచ్చింది. పోసానిగారితో చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది..'' అన్నారు.
హీరో సరీష్ మాట్లాడుతూ..''ఇది నా మొదటి చిత్రం. మొదటి చిత్రంతోనే పోసానిగారితో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు విన్సెంట్ మంచి పాత్ర ఇచ్చారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఈ పాత్రతో నన్ను పరిచయం చేస్తున్న విన్సెంట్‌గారికి ధన్యవాదాలు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను..'' అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









