డేట్-ఫ్రూట్-సాస్
- December 19, 2015
కావలసిన పదార్థాలు : ఎండు ఖర్జూరాలు-20, పంచదార-1 కప్పు, పైనాపిల్ ముక్కలు-అర కప్పు, దానిమ్మ గింజలు-అర కప్పు, కిస్మిస్-అర కప్పు, చెర్రీస్-10, బాదంపప్పు-10, జీడిపప్పు-10, ఆమ్చూర్(ఎండు మామిడిపొడి)-1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి-అర టీస్పూన్, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : ఎండు ఖర్జూరాలను ముందుగానే నానబెట్టి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పావుకప్పు నీరు పోసి, అందులో పంచదార వేసి స్టవ్పై పెట్టి కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అందులో ఖర్జూరపండు ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఆమ్చూర్, కిస్మిస్, చెర్రీస్, బాదంపప్పు, జీడిపప్పు, ఉప్పు వేసి కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. చిక్కబడుతున్న సమయంలోనే దానిమ్మ గింజలు కూడా వేసి స్టవ్ మీది నుంచి దించేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. దీన్ని ఒక గాజు బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకుని అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. ఈ డేట్-ఫ్రూట్-సాస్ను విడిగానూ తినొచ్చు లేదా పరోటాలు, పూరీలు, చపాతీలతోపాటూ తినొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







