కేరళ ప్రయాణికుడి వద్ద కిలో బంగారం స్వాధీనం..
- December 19, 2015
లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం... దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో కేరళకు చెందిన ప్రయాణికుడు అష్రాఫ్ శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగాడు. తన వద్ద ఉన్న మ్యూజిక్ సిస్టమ్ లో ఒక కిలో బంగారాన్ని దాచి ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నాడు. కస్టమ్స్ అధికారులు విషయాన్ని గ్రహించి కేరళ ప్రయాణికుడ్ని తనిఖీ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







