న్యూ ఇయర్ వేడుకల్లో రికార్డ్ బ్రేకింగ్ ఫైర్ వర్క్స్
- October 05, 2018
యూఏఈలో ప్రతి యేడాదీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతాయి. అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్, యూఏఈని ప్రపంచ వ్యాప్తంగా 'పర్యాటక ప్రాంతం'గా మార్చేస్తున్నాయనడం నిస్సందేహం. ఈ ఏడాది కూడా, ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకుగాను రికార్డ్ స్థాయిలో ఫైర్ వర్క్స్‌తో ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. రస్ అల్ ఖైమాకి చెందిన ఫైర్ హోల్డ్ ప్రాజెక్ట్స్ మాస్టర్ డెవలపర్ మర్జాన్ 2019 సంవత్సరానికి అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్‌తో స్వాగతం పలికేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించడం జరిగింది. అల్ మర్జాన్ ఐలాండ్‌లో జరిగే ఈ ఫైర్ వర్క్స్ కోసం ఇప్పటినుంచే హోటల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయిపోయాయి. ఫైర్ వర్క్స్‌తోపాటు ఎంటర్‌టైనింగ్ యాక్టివిటీస్, ఫెస్టివ్ ప్రమోషన్స్.. ఇలా చాలా హంగులు న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాటు చేస్తారు. 2018 వేడుకలు రస్ అల్ ఖైమా, అల్ మర్జాన్ ఐలాండ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







