వికలాంగులకు పార్కింగ్ ఇక్కట్లు - ఒమన్ పోలీస్ సీరియస్
- December 19, 2015
వికలాంగులకోసం కేటాయించిన పార్కింగ్ స్లాట్స్‌లో సాధారణ మోటరిస్టులు తమ వాహనాలు నిలుపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు గుర్తించిన రాయల్ ఒమన్ పోలీసులు, ఇకపై వికలాంగుల పార్కింగ్ స్థలాల్లో సాధారణ వ్యక్తులు వాహనాల్ని నిలిపితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నిబంధనల్ని అతిక్రమించినవారికి 10 ఒమన్ రియాల్స్ ఫైన్ విధించనున్నామన్నారు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు. నిబంధనల్ని పదే పదే ఉల్లంఘించినవారికి ఇంకా అధిక మొత్తంలో ఫైన్ విధించాలని హిమాన్షు మండాలియా అనే ఎక్స్‌పాట్ రాయల్ ఒమన్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఓ సర్వేలో 82 శాతం మంది వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో తాము వాహనాల్ని పార్కింగ్ చేయబోమని చెప్పగా, 18 శాతం మంది మాత్రం ఆ నిబంధనను తాము ఉల్లంఘించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







