ఒమన్ వైపు దూసుకొస్తున్న లుబాన్ తుపాన్
- October 09, 2018
మస్కట్: లుబాన్ తుపాను, క్రమంగా ట్రోపికల్ సైక్లోన్ 1గా మారి, ఒమన్ వైపు దూసుకొస్తోందని పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. తాజా వెదర్ చార్ట్స్ - శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం పలు ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఒమన్‌లో. అరేబియన్ సీ మధ్యలో లుబాన్ ప్రస్తుతం కేంద్రీకృతమైంది. సలాలా సిటీ నుంచి 830 కిలోమీటర్ల దూరంలో వుందిప్పుడు తుపాను కేంద్రం. దోఫార్ గవర్నరేట్, యెమెన్ కోస్ట్లవైపుగా ఇది మూవ్ అవుతూ వస్తోంది. రానున్న 24 గంటల్లో ఇది ఫస్ట్ డిగ్రీ తీవ్రతను సంతరించుకోబోతోంది. దోఫార్, అల్ వుస్టా తదితర ప్రాంతాల్లోనూ అక్టోబర్ 10నుంచి ఈ తుపాను ప్రభావం వుండొచ్చు. శుక్రవారం సాయంత్రానికి దోఫార్, అల్ వుస్తా గవర్నరేట్స్ పరిధిలో భారీ వర్షాలు, భారీ గాలులు వీస్తాయి. సముద్ర కెరటాలు 6 నుంచి 8 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశముంది. ప్రజలు లోతట్టు ప్రాంతాలకు దూరంగా వుండాలనీ, సముద్ర తీర ప్రాంతాల వైపు వెళ్ళరాదని ఇప్పటికే పిఎసిఎ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







