షార్జాలో ప్రముఖ రోడ్ పాక్షికంగా మూసివేత
- October 24, 2018
షార్జా:సెంట్రల్ మార్కట్, ఇత్తిహాద్ పార్క్ వైపుకు వెళ్ళే మోటరిస్టులు కాస్తంత జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని రోడ్లపై రెండు నెలలపాటు సుదీర్ఘమైన డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం వుంది. షార్జా ఆర్‌టిఎ డైరెక్టర్ ఆఫ్ రోడ్స్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ టెండర్స్ ఇంజనీర్ షేకా అల్ జువైన్ మాట్లాడుతూ, సెంట్రల్ మార్కెట్, ఇతిహాద్ పార్క్ చుట్టూ రోడ్డుసైడ్ పేవ్‌మెంట్స్‌పై టైల్స్ అలాగే అస్ఫాల్ట్ లేయర్స్‌ని మార్చాల్సి వుందని చెప్పారు. 4 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో కింగ్ ఫైసల్ రోడ్ - ఇతిహాద్ పార్క్ వుంది. ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు, స్ట్రీట్స్ రీపెయింట్ చేయాల్సి వుంది. షార్జా పోలీసులతో కలిసి ఆర్‌టిఎ షార్జా, ప్రత్యామ్నాయ రూట్లను వాహనదారుల కోసం సూచిస్తోంది. వాహనదారులు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







