ఇండియా:పెట్రోల్ రేట్లు భారీగా తగ్గే అవకాశం
- November 02, 2018
భారత్‌లో పెట్రోల్ రేట్లు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల పునరుద్దరణతో భారత దేశానికి ఊరట లభించి అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ముడి చమురు కొనేందుకు ఇండియా, సౌత్ కొరియా, జపాన్ సహా 8 దేశాలకు అమెరికా అనుమతిచ్చింది.
వచ్చే వారం నుంచి ఇరాన్‌పై అమెరికా మరోసారి ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి పూర్తిగా ఆయిల్ దిగుమతులను నిలిపేయాలని అన్ని మిత్ర దేశాలను గతంలో అమెరికా ఆదేశించింది. అయితే తమకు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ 8 దేశాలు కోరాయి. ఇండియా తోపాటు జపాన్, సౌత్ కొరియా తమ చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఇరాన్‌పైనే ఆధారపడుతున్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ దేశాలకు పెద్ద ఊరట కలిగించేదే.
ఇప్పటికీ అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, రెండో రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని చైనాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇండియా, సౌత్ కొరియాలాగే చైనా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఊరట తాత్కాలికంగా మాత్రమే ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
అమెరికా విధించిన ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో రోజుకు 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్.. ఏడాది చివరినాటికి 15 లక్షల బ్యారెళ్లను మాత్రమే చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







