హైపర్ మార్కెట్లో ఫైర్ 1 మిలియన్ ఒమర్ రియాల్స్ నష్టం
- December 22, 2015
1 మిలియన్ ఒమన్ రియాల్స్కి పైగా హైపర్ మార్కెట్ అగ్ని ప్రమాదం కారణంగా సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఇన్ ములాదాకి ఎదురుగా ఉన్న హైపర్ మార్కెట్లో సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చినట్లుగా అధికారులు చెప్పారు. ఒక మిలియన్ ఒమన్ రియాల్స్కి పైగా నష్టం అనేది కేవలం అంచనా మాత్రమేనని, అధికారికంగా ఎంత నష్టం జరిగిందీ వెల్లడి కావాల్సి ఉందని అధికారులు వివరించారు. 80 మంది ఫైర్ ఫైటర్స్, 20 ఫైరింజన్స్, పెద్ద సంఖ్యలో వాటర్ ట్యాంకర్లను వినియోగించి అధికారులు హైపర్ మార్కెట్లో ఎగసిపడ్డ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఓవర్ లోడ్కి తట్టుకోలేకపోవడం, అలాగే లూజ్ వైరింగ్ వంటివి ప్రమాదానికి కారణాలుగా తెలియవస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







