మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!
- November 20, 2018
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్‌బాబుతో కలిసి సినిమా చేస్తారని చాలా మంది భావించారు. ‘తప్పకుండా సినిమా చేస్తాం’ అని పలు సందర్భాల్లో మహేశ్, రాజమౌళి చెప్పటంతో వీరిద్దరి కాంబినేషన్‌లోనే నెక్ట్స్ మూవీ ఉంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇద్దరూ స్పష్టం చెయలేదు. ఈ నేపథ్యంలో చరణ్, తారక్ తో రాజమౌళి మూవీ ప్రారంభించటంతో మహేష్ అభిమానులు కొంత నిరుత్సాహ పడ్డారు. అయితే మహేష్, రాజమౌళి సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ తర్వాత.. రాజమౌళి చేయబోయేది మహేశ్ చిత్రమే అని చిత్రపరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. అయితే 2020 వరకూ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో బిజీగా ఉండనున్నారు. ఈలోపు మహేశ్.. సుకుమార్, సందీప్ రెడ్డితో సినిమాలు పూర్తి చేసుకుంటారని టాలీవుడ్ టాక్.
ఇదిలా ఉంటే రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఓ సరికొత్త పాయింట్‌తో ఉండబోతోందని ప్రచారం ఇప్పటి నుంచే జరుగుతోంది. మరో విశేషమేంటంటే ఈ మూవీ ద్వారానే మహేశ్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తారట. మరి అధికారికంగా ప్రకటించే వరకు ఈ కాంబినేషన్‌పై ఇంకా ఎన్ని వార్తలు వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







