15 ఏళ్ల చిన్నోడితో సుస్మితా సేన్ డేటింగ్
- November 20, 2018
బాలీవుడ్ లో హీరోయిన్స్ ఏం చేసిన అదే కరెక్టే అని మైకం లో ఉంటారు సమాజం తో వారికి సంభందం లేదు విలువల గురించి అస్సలక్కర్లేదు . అయితే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గత కొంతకాలంగా పెళ్లికి దూరంగా వుంటూ వరుస ప్రియులను మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే సడన్గా ఈ ముదురు బ్యూటీకి పెళ్లిమీద గాలిమళ్లినట్టుంది. ప్రముఖ మోడల్ రోమన్ షాల్ తో సుస్మిత గత కొంత కాలంగా రహస్య డేటింగ్ లో వుందని వార్తలు జోరందుకున్నాయి.
ఆ వార్తల్ని నిజం చేస్తూ సుస్మిత తన సోషల్ మీడియా ట్వట్టర్ లో వరుస ఫొటోలు పోస్ట్ చేసి `చాలా.. ఇంకా కావాలా` అని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని చెప్పి షాకిచ్చింది. అయితే సుస్మిత ప్రియుడు రోమన్ షా సోమవారం అదిరిపోయే పోస్ట్ పెట్టి ఇద్దరి మధ్య వున్న బంధాన్నిఇన్ స్టాగ్రామ్ సాక్షిగా బట్టబయలు చేశాడు. సోమవారం సుస్మితాసేన్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రోమన్ షా 'నా ప్రేయసికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఈ ఏడాది నీకు అద్భతంగా వుండాలి. నువ్వు మధురమైన క్షణాల్ని గడపాలని కోరుకుంటున్నా. సుష్ ఐ లవ్ యు'.. అంటూ రోమన్ షా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ పోస్ట్ చూసిన వారంతా ముదురు ప్రేమ ఇన్ స్టాగ్రామ్ కెక్కిందే అంటూ చలోక్తులు విసురుతున్నారు. ముంబైలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో సుస్మిత - రోమన్ తొలిసారి కలిశారట. ఆ తరువాత ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిందని అది ప్రేమగా మారిందని చెబుతున్నారు. రోమన్ షా కంటే సుస్మిత 15 ఏళ్లు పెద్దది కావడం ఇక్కడ గమనార్హం. అయినా ముదురు ప్రేయసితో రోమన్ షా పెళ్లికి సిద్ధమవుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోందట.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి