దేవుడు ఆదేశించాడు.. నేను రేప్ చేస్తున్నాను!
- November 22, 2018
టోక్యో: ఇది మరో డేరా బాబా కథ. సౌత్ కొరియాలో జరిగింది. తనకు తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే ఓ పాస్టర్ తన అనుచరులైన 8 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో అక్కడి కోర్టు అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పైగా తాను చేసిన ఈ పాపానికి జేరాక్ లీ అనే ఆ పాస్టర్ దేవుడి పేరు చెబుతున్నారు. దేవుని ఆదేశాల మేరకే ఈ పని చేస్తున్నట్లు సదరు మహిళలకు లీ చెప్పేవాడు. అతడు సాధారణ వ్యక్తి కాదు. మాన్‌మిన్ సెంట్రల్ చర్చ్ చీఫ్. ప్రపంచవ్యాప్తంగా దీనికి పది వేల చర్చ్‌లున్నాయి. లక్షా 33 వేల మంది అనుచరులు ఉన్నారు. అలాంటి చర్చి వ్యవహారాలు చూసే జేరాక్ లీ ఈ దారుణానికి పాల్పడటం చాలా మందిని షాక్‌కు గురి చేసింది. మొదటి నుంచీ లీది వివాదాస్పద జీవితమే 1999లోనే క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ కొరియా నుంచి తొలగించారు.
లీ అత్యాచారం చేసిన మహిళలు చిన్నప్పటి నుంచీ అదే చర్చికి వెళ్తున్నారు. అతన్నో దేవుడిగా వాళ్లు ఆరాధిస్తున్నారు. లీ చెప్పిన ఏ విషయాన్నీ కాదనే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వాళ్లు చేరుకున్నారు. ఇదే వాళ్లపై అత్యాచారం చేయడానికి జేరాక్ లీకి అవకాశం కల్పించింది. అయితే కోర్టు విచారణలోనూ ఈ పనికి తాను పశ్చాత్తాప పడటం లేదని 75 ఏళ్ల లీ చెప్పడం విశేషం. బాధితురాళ్ల కంటే వయసులోనూ 50 ఏళ్ల పెద్దవాడు. లీ తమతో అసభ్యంగా ప్రవర్తించినా సరే అది తమ పాపాలను కడిగేసే చర్యగా వాళ్లు భావించారే తప్ప లైంగిక దాడిగా బాధితురాళ్లు చూడలేదని విచారణ సందర్భంగా కోర్టు చెప్పింది. రెండు దశాబ్దాలుగా లీ ఇలా తన మహిళా అనుచరులపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







