స్మగ్లింగ్ డ్రగ్ పిల్స్: ముగ్గురికి జైలు
- November 29, 2018
యూ.ఏ.ఈ:12 మిలియన్ కాప్టగాన్ పిల్స్‌ని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ముగ్గురికీ జీవిత ఖైదుని ఖరారు చేసింది అబుదాబీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్. వీరి వద్ద నుంచి 480 మిలియన్ దిర్హామ్‌ల విలువైన కాప్టగాన్ పిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ షిప్ ద్వారా ఈ పిల్స్‌ని యూఏఈలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. మొదటి నిందితుడ్ని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశాక, నలభై ఐదు రోజుల అనంతరం మిగతా నిందితుల్ని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో తొలుత నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. విచారణ సందర్భంగా అధికారులు పూర్తిస్థాయిలో ఆధారాలు చూపించడంతో న్యాయస్థానం నిందితుల్ని దోషులుగా నిర్ధారించి, శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







