షార్జా:ఫ్లూ వలన భారతీయ బాలిక మృతి
- November 29, 2018
షార్జా:షార్జాలోని గల్ఫ్ ఏసియన్ స్కూల్‌లో ఆరేళ్ళ ఇండియన్ బాలిక ఫ్లూ కారణంగా మృతి చెందినట్లు స్కూల్ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. గ్రేడ్ 2 చదువుతున్న షిబా ఫాతిమా, ఫ్లూ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సర్కులర్‌లో పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ఈ విషయమై స్కూల్ యాజమాన్యం విజ్ఞప్తి కూడా చేసింది. చిన్నారిని ఇంట్లోనే వుంచాలనీ, స్కూల్‌కి పంపించరాదని ఆ విజ్ఞప్తి లేఖలో పేర్కొన్నారు. కాగా, ఫాతిమాను ఆసుపత్రికి తరలించగా, ఆమె అక్కడ మృతి చెందింది. ఫ్లూ కారణంగా మరణాలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్లూ సంబంధిత లక్షణాలు బయటపడిన వెంటనే తగిన వైద్య సహాయం అందించాల్సి వుంటుంది. నిర్లక్ష్యం, ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్లూ సంబంధిత మరణాలు ఎక్కువవుతుండడం పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







