భోజనానికి ముందు నీరు తాగితే..

- November 30, 2018 , by Maagulf
భోజనానికి ముందు నీరు తాగితే..

చాలామందైతే ఏదో నీరు తాగానికి తాగుతుంటారు. మరికొందరైతే అసలు నీళ్లే తీసుకోరు. ఇంకా చెప్పాలంటే.. చాలామంది భోజనం చేసిన అరగంటకో లేదా గంట తరువాతో నీరు తాగుతుంటారు. ఇలా చేస్తే తిన్న ఆహరం జీర్ణం కాకుండా.. కడుపు ఉబ్బరం, అజీర్తి, కళ్లు తిరగడం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
 
భోజనానికి ముందు నీరు తాగడం వలన భోజన సమయంలో తక్కువగా తినాలనిపిస్తుంది. తద్వారా ఆకలి నియంత్రణ ఉండదు. దీని కారణంగా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక భోజనాంతరం తరువాత నీరు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువును తగ్గించవచ్చును. ఒక రోజుకు కనీసం 4 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి.
 
ఆకలిగా ఉన్నప్పుడు.. హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే ఇంట్లో తయారుచేసిన సహజసిద్ధమైన పదార్థాలు తీసుకుంటే క్యాలరీలు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాల్సిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com