కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- November 09, 2025
కువైట్: కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కీలక రంగాలలో కువైట్ మరియు కేరళ మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ఈ సందర్భంగా దృష్టి సారించారు.
భారత్ మరియు కువైట్ మధ్య దీర్ఘకాల చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా కేరళ కమ్యూనిటీ కువైట్ అభివృద్ధికి అందించిన అమూల్యమైన సహకారాన్ని షేక్ ఫహద్ ప్రశంసించారు. కేరళ కమ్యూనిటీ పట్ల కువైట్ కు ఉన్న సాన్నిహిత్యానికి కేరళ ముఖ్యమంత్రి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు.
కేరళలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి త్వరలో కువైట్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కేరళను సందర్శిస్తుందని షేక్ మెషాల్ ప్రకటించారు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఖలీఫా అబ్దుల్లా దహి అల్-అజిల్ అల్-అస్కర్తో కూడా కేరళ సీం సమావేశం నిర్వహించి కేరళ లో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను వివరించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







