సుబ్రహ్మణ్యపురం మూవీలో రానా
- December 01, 2018
సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు.అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కథ ను నడిపించడం లో ఆ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ను పోషించనుందట. ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది.దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు.
దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానా కు ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’ చిత్రం డిసెంబర్ 7న విడుదలకు కాబోతుంది.
భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? ‘‘సుబ్రహ్మణ్యపురం’’ లో దాగున్న రహాస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం ‘‘సుబ్రహ్మణ్యపురం’’.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







