బిళ్ళల పులుసు
- May 10, 2015
ఈరోజు ఒక వైవిధ్యమైన వంటకం తో మీ ముందుకు వచ్చాం. తెలంగాణా వారి ప్రత్యేకం. అదే ‘బిళ్ళల పులుసు’. దీనినే ‘వెజ్ చేపల కూర’ అని కూడా అంటారు. మరి తయారీ ఎలాగో చూసేద్దామా..!
కావలసిన పదార్ధాలు:
- ఉల్లిపాయలు - 2 లేక 3 పెద్దవి
- జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూను
- ఉప్పు - తగినంత
- పచ్చికారం - సరిపడా
- శనగపిండి - 1 కప్పు
- మెంతి పొడి - 1/2 టేబుల్ స్పూను
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూను
- చింతపండు రసం - 3 టేబుల్ స్పూన్లు
- బెల్లం - కొద్దిగా
- కరివేపాకు - కొద్దిగా
- కొత్తిమీర - కొద్దిగా
- నీరు - 1 1/2 కప్పు
చేయు విధానం:
బిళ్ళలు:
- ఒక బాండీలో నూనె పోసి వేడి చేయాలి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేపండి.
- ఇప్పుడు నీళ్ళు, ఉప్పు, పచ్చికారం వేసి కాగనివ్వండి.
- శనగపిండి ని చల్లటి నీళ్ళల్లో కలిపి ఆ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న నీటిలో మెల్లిగా ఉండలు కట్టకుండా చూసుకుంటూ వేయాలి. మూకుడు అంచులకి శనగపిండి అంటనంతవరకు ఉడికించి స్టవ్ మీద నుండి దించేయాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ కి నూనె/నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేయండి. చల్లారాక, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోండి.
పులుసు:
- ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయండి. ఇందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెళ్లి ముద్ద, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేదాక వేయించండి.
- ఇప్పుడు చింతపండు రసం వేసి బాగా మరగనివ్వండి.
- ఉప్పు, మెంతి పొడి, పచ్చికారం, ధనియాల పొడి, బెల్లం వేసి ఒక 5-7 నిమిషాలు మరగనివ్వండి.
- ముందుగా చేసుకున్న బిళ్ళలు ఇందులో మెల్లిగా వేసి మరి కాసేపు అనగా 2-3 నిమిషాలు మరగనిచ్చి, స్టవ్ మీద నుండి దించి కోత్హిమీర చల్లి సర్వ్ చేసుకోవటమే.
ఇది అన్నంతో మరియు రోటి తో బాగుంటుంది.
------ పి.రమ్య, దుబాయ్, యు ఏ ఈ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







