అంతా మన మంచికే!
- May 11, 2015
అనంగ రాజ్యంలో అనంతవర్మ అనే రాజు ఉండేవాడు. అతడు తెలివైనవాడూ మంచి పాలకుడు. అతని దగ్గర ఆనందుడు అనే మంత్రి ఉండేవాడు. అతను ఎప్పుడూ ఆశావాదంతో ఉండేవాడు. జరిగిన చెడును కూడా మంచిగా మలుచుకునే విధంగా ఆలోచనలు చేసేవాడు. అన్నింటికీ మంచే జరుగుతుందని నమ్మేవాడు. అందుకే ఎవరేం చెప్పినా 'ఏం ఫర్వాలేదు! అంతా మన మంచికే' అనేవాడు. ఒక రోజు ప్రమాదవశాత్తూ ఆ రాజ్యపు రాజు అనంతవర్మ చేతి ఉంగరపు వేలు తెగిపోయింది. ఆ విషయం తెలిసిన ఆనందుడు రాజుగారితో 'అంతా మన మంచికే, చింతించకండి' అని చెప్పాడు. అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి 'నా వేలు తెగిపోతే మంచికే అంటాడా! ఇతడిని కారాగారంలో పడేయండి' అని ఆదేశించాడు. తరవాత ఓ రోజు రాజు వేటకు వెళ్ళాడు. అప్పుడు అక్కడి కొండజాతి వాళ్ళు అతడిని బంధించి తీసుకుపోయారు. ఏ లోపమూ లేకుండా ఉండి మంచి రూపం కలిగి మంచి సమయంలో జన్మించిన వ్యక్తిని వాళ్ళ దేవతకు బలివ్వడానికి ఇతడిని పట్టుకుపోయారు. తీరా బలి ఇచ్చే సమయానికి వారిలో ఒకడు ఇతనికి ఒక వేలు లేదని గుర్తించాడు. శరీరంలో ఒక భాగం లేనివాడు వాళ్ళకు బలి ఇవ్వడానికి పనికిరాడు కనుక వాళ్ళు అనంతవర్మను వదిలేశారు. వెంటనే రాజుకు ఆనందుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అవును 'ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది' అనుకొని, రాజ్యానికి తిరిగి వెళ్ళిన వెంటనే మంత్రి ఆనందుడిని చెరసాల నుంచి బయటకు తెప్పించి పెద్ద సన్మానం చేసి మళ్ళీ తన మంత్రిగా నియమించుకున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







