'భలే మంచి రోజు' చిత్రానికి మహేశ్‌బాబు, ప్రభాస్ చేసిన ప్రచారం ..
- December 23, 2015
ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాను ప్రమోట్ చేస్తే ఇంకేం కావాలి? కావల్సినంత పబ్లిసిటీ. 'భలే మంచి రోజు' విషయంలో ఇదే జరిగింది. సుధీర్‌బాబు హీరోగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శశిధర్‌రెడ్డి, విజయ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు, ప్రభాస్ చేసిన ప్రచారం చాలా ఉపయోగపడింది. ఈ విషయం గురించి నిర్మాతలు మాట్లాడుతూ - ''ఈ చిత్రం ఆడియో విడుదలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మా ట్రైలర్‌ను మెచ్చుకున్నారు. అలాగే ప్రభాస్ అయితే మా సినిమాకు సంబంధించిన విశేషాలు స్వయంగా అడిగి తెలుసుకుని, మా ప్రయత్నాన్ని అభినందించారు. ఈ ఇద్దరూ ఇచ్చిన సపోర్ట్ మా సినిమా మీద అంచనాలను పెంచింది. అందుకే మహేశ్, ప్రభాస్‌లకు చాలా థ్యాంక్స్. ఈ చిత్రం అన్నివర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







