ప్రపంచం మొత్తం నాలెడ్జ్‌పై ఆధారపడి ఉందని: చంద్రబాబు
- December 23, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రసిధ్ది చెందిన పది యూనివర్శిటీల శాఖలను రాష్ట్రంలో నెలకొల్పడమే ద్యేయమని చెప్పారు. ప్రైవేట్ వర్శిటీల్లో ఫీజు రీయంబర్స్మెంట్పై ఆలోచిస్తున్నామని అన్నారు. నూజీవీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో 55 శాతం విద్యార్థినులు ఉండడం మంచి పరిణామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం నాలెడ్జ్‌పై ఆధారపడి ఉందని, పేదరిక నిర్మూణ జరగాలన్నా, సంపద సృష్టించబడాలన్నా నాలెడ్జ్ చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయడ్డారు. ఆ నాలెడ్జ్ ఇచ్చేది విద్యా సంస్థలన్న విషయం గుర్తుపెట్టుకోవాలసిన అవసరం ఉందని అన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో బాబుతోపాటు మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







