ఘోరం..గుడిలో ప్రసాదం తిని 5 మంది మృతి..
- December 14, 2018
కర్నాటక:కర్నాటకలో ఘోరం చోటు చేసుకుంది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగాళ గ్రామంలోని మారమ్మ గుడిలో ప్రసాదం తిని 5 మంది చనిపోయారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మైసూర్‌లోని ఆస్పత్రిలో మరో 50 మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇంత ఘోరం జరగడానికి ఫుడ్ పాయిజన్ అవడం కారణం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసాదంలో విష గుళికలు కలిశాయని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. అందుకే.. ఇంత పెద్ద ఘోరం జరిగిందని చెప్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించారు.
కర్నాటకలో 5 మంది భక్తుల ప్రాణాలు తీసిన పాపం ఎవ్వరిది? ఈ విషయంలో దృష్టి సారించిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. కొన్నాళ్లుగా స్థానికులకు, ఆలయ పూజారికి మధ్య వివాదం నడుస్తున్నట్టు బయటపడింది. ఈనేపథ్యంలో ప్రసాదంలో ఎవరో విషం కలిపి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







