'డియర్ కామ్రేడ్' కు తప్పిన పెను ప్రమాదం
- December 17, 2018
వరుస అవకాశాలతో దూసుకుపోతోన్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల లడక్‌లో షెడ్యూల్ పూర్తి కావడంతో కాకినాడలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండకు జోడీగా రష్మికా మండన్నా నటిస్తోంది. కాగా కాకినాడలో జరుగుతున్న షూటింగ్‌లో విజయ్‌దేవరకొండ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షూటింగ్‌లో భాగంగా కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి విజయ్ పట్టుతప్పి కిందపడిపోబోయారు. అనంతరం తిరిగి పట్టుచిక్కి ట్రైన్ ఎక్కారు. ఈ ఘటనలో విజయ్‌కి చిన్న గాయమే అయినా, ఒకవేళ పట్టుతప్పి పడిపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని తెలుస్తోంది. చిత్ర షూటింగ్ జరుగుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, షూటింగ్‌లో గాయపడిన విజయ్ జీవితంలో ఏదీ ఊరికే రాదు.. గాయాలతో కూడా పండగ చేసుకోవాలి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







