ఇజ్రేల్ ప్రధాని కుమారుడు చేసిన నిర్వాకం
- December 18, 2018
ఇజ్రేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పెద్దకుమూరుడైన యైర్ నెతన్యాహూ పెట్టిన ముస్లిం వ్యతిరేక పోస్టులు ఫేస్‌బుక్ తొలగించింది. ఇజ్రేల్ నుంచి మొత్తం ముస్లింలంతా వెళ్లిపోవాలని అతడు పోస్టు పెట్టాడు. ఇజ్రేల్‌లో శాంతి కావాలంటే యూదులైనా వెళ్లిపోవాలి లేదా ముస్లింలైనా వెళ్లిపోవాలి.. ముస్లింలు వెళ్లిపోతే బాగుంటుందని నా అభిప్రాయం అని అందులో రాశాడు. దీంతో 24 గంటల పాటు యైర్ పేజీని ఫేస్‌బుక్ నిలిపివేసింది. ఆతర్వాత పోస్టును తొలగించింది. దీనిపై యైర్ మండిపడ్డాడు.
ఇది ఆలోచనలపై నిరంకుశత్వం తప్ప మరేమీ కాదని విమర్శించాడు. ఫేస్‌బుక్‌ను తిట్టడానికి అతడు ట్విటర్‌కు మళ్లడం గమనార్హం. భూమిమీద దాడులంటూ జరుగని దేశం ఏదైనా ఉందా? బహుశ ఐస్‌ల్యాండ్ లేదా జపాన్‌లో జరుగవేమో.. ఎందుకంటే అక్కడ ముస్లింలు అసలు లేరంటూ మళ్లీ అదేరకం పాట అందుకున్నాడు. ఈ వ్యవహారంపై ప్రధాని ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు. ప్రధాని ఇంట్లో ఉంటూ యైర్ ఓ బాడీగార్డు, డ్రైవరు, ఇతర సౌకర్యాలు అనుభవిస్తున్నాడని వారంటున్నారు.
వారసత్వ రాజకీయాలు నెలకొల్పేందుకు యైర్ తల్లిదండ్రులు అతడిని భావినేతగా తీర్చిదిద్దుతున్నట్టు ఉన్నదని వారు పేర్కొంటున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఇజ్రేలీ యూదుల్లో తీవ్ర జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







