ఖసరిబేసిగ నియమం నుంచి మహిళలకు, వీఐపీలకు మినహాయింపు
- December 24, 2015
మహిళలకు, వీఐపీలకు ఖసరిబేసిగ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో కాలుష్యం అధికంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం కార్ల వాడకం తగించేందుకు ఖసరిబేసిగ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. 12ఏళ్లలోపు పిల్లలు ఉన్న మహిళలకు, ఒంటరి మహిళలకు, వీఐపీలకు జనవరి 15వ తేదీ వరకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. నియమాన్ని అతిక్రమించిన వారికి రూ.2వేలు జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, చీఫ్ జస్టిస్, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, కేంద్రమంత్రులు, ప్రతిపక్షపార్టీ నేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ వీఐపీల జాబితాలో ఉంటారని, అత్యవసర వాహనాలకు కూడా ఈ నియమం వర్తించదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ 6వేల బస్సులను అదనంగానడపనున్నట్లు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







