విదేశీ అభ్యర్దికి ఉపాధి ఒప్పంద ఖచ్చితంగా స్థానిక బాషలోనే ఉండాలి
- December 24, 2015
కొత్త ఏడాది నుంచి మూడు నూతన్ కార్మిక నియమాలు అమలులో రానున్నాయి. ఇవి రాజ్యాంగం మరియు అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు ఏకరీతిగా ఉండేలా రూపొందించినట్లు కార్మిక మంత్రి , జాతీయ అర్హతల సంస్థ చైర్మన్ సక్ర్ ఘోబాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 24 / 7 ఎమిరేట్స్ ఈ 3 నిబంధనలను గూర్చి వివరించారు. ఇందులో ఉద్యోగ ఒప్పందం ముఖ్యమైనధి.
ఉద్యోగ ఒప్పందం :
ఉద్యోగం ఇచ్చే యజమాని విదేశీ అభ్యర్దితో ఇరువురి హక్కుల వివరాలపై ఉద్యోగం పొందే అభ్యర్ధికి అర్ధమయ్యేలా అతని సొంత బాష లోనే ఉండాలి. యజమాని విదేశీ ఉద్యోగికి సంబంధిత పని వివరాలు, నియమాలను గూర్చి స్పష్టంగా లిఖితపూర్వకమగా అందివ్వాలి. కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం యజమాని, ఉద్యోగి పని హక్కులు , బాధ్యతలు గూర్చి నియామకపు లేఖలో విధిగా ఉండాలి. ఉద్యోగి తాను చేస్తున్న సంస్థలో ఉన్న హక్కులను బాధ్యతలను అర్ధం చేసుకొనే వీలు కల్పించాలి. అలాగే , ఉద్యోగం ఇచ్చిన యజమాని ఉద్యోగీకు అందించిన ఒప్పందం తో పాటు , విదేశీ ఉద్యోగీ అయెతే వర్క్ పర్మిట్ ఉండాలి. అందులో ఇరువురు ( యజమాని, ఉద్యోగి ) సంతకాలు చేసి ఉండాలి. కార్మిక మంత్రిత్వ శాఖ దీనిని సమ్మతించాలంటే, ఉద్యోగ ఒప్పందంలో ఇరువురు తప్పక సంతకం చేస్తేనే, ఈ ఒప్పందం న్యాయ సమ్మతం అవుతుంది. ఇది రిజిస్టర్ కాబడినపుడే, భవిష్యత్ లో ఏదైనా సమస్య తలెత్తినపుడు కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిగే ఎటువంటి నియమకానికైనా ఇవే షరతులు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







