కృష్ణాష్టమి సినిమాతో సునీల్..
- December 25, 2015
హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్, హీరోగా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త పరవాలేదనిపించినా, తర్వాత ఓ మోస్తరు హిట్ కూడా ఇవ్వలేక తడబడ్డాడు. ఇలాంటి సమయంలో కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సినిమా అప్ డేట్స్ ను తెలియజేస్తూ ఓ ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా గ్రాండియర్ తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సాంగ్, సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. ముందుగా సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం భారీ పోటీ ఉండటంతో మరోసారి వాయిదా వేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి అనుకున్నట్టుగా కృష్ణాష్టమి సునీల్ కెరీర్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







