ఒమన్‌లో ఇన్షూరెన్స్పై 3 శాతం పన్ను
- December 25, 2015
ఇక నుంచి ఒమన్‌లో ఇన్స్యూరెన్స్‌పై మూడు శాతం పన్ను అదనంగా వడ్డించబడుతుంది. ఇప్పటిదాకా ఉన్న 1.6 శాతం గవర్నమెంట్ ట్యాక్స్‌కి అదనంగా మూడు శాతం పన్నును ఇన్స్యూరెన్స్‌పై వసూలు చేయనున్నారు. మజ్లిస్ అల్ షురా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావం, తద్వారా తలెత్తిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మజ్లిస్ అల్ షురా వర్గాలు వెల్లడించాయి. మొత్తం 39 మంది సభ్యుల్లో 22 మంది ఈ పన్నుకు అనుకూలంగా ఓటు ఏయగా, 17 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. స్టేట్ కౌన్సిల్‌కి ఈ ప్రపోజల్ పంపబడింది. అయితే లైఫ్ ఇన్స్యూరెన్స్ రీఇన్స్యూరెన్స్ స్కీమ్స్ ఈ సర్ఛార్జ్ నుంచి మినహాయింపబడనున్నాయని షురా వర్గాలు వెల్లడించాయి. అలాగే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్‌ని కూడా మూడు శాతం పెంచింది. ఆయిల్ మరియు గ్యాస్ ఇండస్ట్రీ ఆదారిత కంపెనీలపై పన్నుని 12 శాతం నుంచి 35 శాతానికి పెంచనున్నారు. లిక్విడ్ నేచురల్ గ్యాస్ కంపెనీలకు కూడా ఇదే స్థాయిలో పన్నులు పెంచారు. 2014 జూన్‌లో ఒమన్ ఆదాయం 60 శాతానికి తగ్గినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







