ఒమన్‌లో ఇన్షూరెన్స్‌పై 3 శాతం పన్ను

- December 25, 2015 , by Maagulf
ఒమన్‌లో ఇన్షూరెన్స్‌పై 3 శాతం పన్ను

ఇక నుంచి ఒమన్‌లో ఇన్స్యూరెన్స్‌పై మూడు శాతం పన్ను అదనంగా వడ్డించబడుతుంది. ఇప్పటిదాకా ఉన్న 1.6 శాతం గవర్నమెంట్‌ ట్యాక్స్‌కి అదనంగా మూడు శాతం పన్నును ఇన్స్యూరెన్స్‌పై వసూలు చేయనున్నారు. మజ్లిస్‌ అల్‌ షురా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావం, తద్వారా తలెత్తిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మజ్లిస్‌ అల్‌ షురా వర్గాలు వెల్లడించాయి. మొత్తం 39 మంది సభ్యుల్లో 22 మంది ఈ పన్నుకు అనుకూలంగా ఓటు ఏయగా, 17 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. స్టేట్‌ కౌన్సిల్‌కి ఈ ప్రపోజల్‌ పంపబడింది. అయితే లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ రీఇన్స్యూరెన్స్‌ స్కీమ్స్‌ ఈ సర్‌ఛార్జ్‌ నుంచి మినహాయింపబడనున్నాయని షురా వర్గాలు వెల్లడించాయి. అలాగే కార్పొరేట్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ని కూడా మూడు శాతం పెంచింది. ఆయిల్‌ మరియు గ్యాస్‌ ఇండస్ట్రీ ఆదారిత కంపెనీలపై పన్నుని 12 శాతం నుంచి 35 శాతానికి పెంచనున్నారు. లిక్విడ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంపెనీలకు కూడా ఇదే స్థాయిలో పన్నులు పెంచారు. 2014 జూన్‌లో ఒమన్‌ ఆదాయం 60 శాతానికి తగ్గినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com