కేరళ-మస్కట్‌కు డైరెక్ట్ ఫ్లైట్:గోఎయిర్ ఆఫర్
- January 19, 2019
న్యూఢిల్లీ:విమానయాన రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎయిర్‌లైన్ సంస్థలు ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ ఎయిర్‌లైన్ గో ఎయిర్ అంతర్జాతీయ విమాన టికెట్లపై రాయితీ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా కేరళలోని కన్నూరు -మస్కట్- కన్నూరు మధ్య నడిచే విమానాలకు ఈ ధరలు వర్తించనున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి వారానికి మూడు (మంగళ, గురు, శని వారాల్లో) డైరెక్ట్ విమాన సర్వీసులను నడుపుతుంది. అన్ని చార్జీలు కలుపుకుని ఇంటర్నేషనల్ ఎయిర్ టికెట్ ధరలు (ఒకవైపు) రూ.4999 నుంచి ప్రారంభం అవుతాయని గో ఎయిర్ వెల్లడించింది. తక్షణమే అంటే ఈ రోజు (జనవరి 19) నుంచి ఈ డిస్కౌంట్ ధరల్లో టికెట్లు లభ్యమవుతాయని తెలిపింది. మరిన్ని వివరాలు గోఎయిర్ అధికారిక వెబ్సైట్లో లభ్యం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







