శంషాబాద్:చెప్పుల్లో భారీ విలువైన బంగారం...
- January 21, 2019
శంషాబాద్:తన పాదరక్షల అడుగుభాగాన రెండు కిలోల బరువైన బంగారం బిస్కెట్లను తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని హైదరాబాద్, శంషాబాద్ ఆర్జీఐఏ అధికారులు పట్టేశారు. ఈ బంగారం విలువ దాదాపుగా రూ.66.2 లక్షలు ఉంటుందని డీఆర్‌ఐ అధికారి ఒకరు తెలిపారు. నిన్న ఉదయం షార్జా నుంచి ఓ ప్రయాణికుడు 2 కిలోల బంగారంతో, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో దిగాడని, తన వద్ద ఉన్న బంగారాన్ని ఇండోర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన వ్యక్తికి అందించాడని వెల్లడించారు. ఆ వ్యక్తి రెండు బంగారం బిస్కెట్లను నాలుగు భాగాలుగా చేసి, తన చెప్పుల అడుగుభాగంలో పెట్టుకున్నాడని, విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న వేళ, అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, బంగారం బయటపడిందని చెప్పారు.
తాజా వార్తలు
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!







