బ్యాగేజీ అలవెన్స్‌పై మేజర్ ఛేంజ్‌ని ప్రకటించిన ఎమిరేట్స్
- January 21, 2019
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, తమ బ్యాగేజీ అలవెన్స్ పాలసీపై మార్పుని ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ఎమిరేట్స్ సర్కులర్ ప్రకారం, పలు బ్యాగేజీ అలవెన్స్‌కి సంబంధించి తగ్గుదల కన్పిస్తోంది. అలాగే ఎకానమీ ఫ్లయర్స్ కోసం ఉచిత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్‌ని కూడా ప్రకటించింది. స్పెషల్, సేవర్, ఫ్లెక్స్ మరియు ఫ్లెక్స్ ప్లస్ టిక్కెట్ విభాగాలుగా ఎకానమీ ఫేర్స్‌ని విభజించింది ఎమిరేట్స్ ఇటీవలే. ఫిబ్రవరి 4 నుంచి స్పెషల్ మరియు సేవర్ టికెట్ హోల్డర్స్ ఇకపై 15 అలాగే 25 కిలోల బ్యాగేజీ అలవెన్స్‌ని పొందుతారు. మామూలుగా అయితే ఈ టిక్కెట్లు 20 అలాగే 30 కిలోల బ్యాగేజీ అలవెన్స్ పొంది వున్నారు. ఫిబ్రవరి 4 కంటే ముందు టిక్కెట్లు పొందినవారికి మాత్రం పాత బ్యాగేజీ అలవెన్స్ స్కీమ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







