బన్నీ గుండెల్లోకి తూటా దించిన అల్లరి పిల్ల
- January 24, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సినిమా ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా హాజరవుతూ అభిమానులని ఉత్సాహపరుస్తున్నాడు. కన్ను గీటిన వీడియోతో దేశం మొత్తం కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించిన ప్రియ వారియర్ ఒరు ఆధార్ లవ్ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు బన్నీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.
బన్నీ గుండెల్లోకి తూటా
అల్లు అర్జున్ ఆడియో వేడుక కోసం రాగానే ఈవెంట్ నిర్వాహకులు ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ప్రియా వారియర్ గన్ షాట్ మ్యూజిక్ ప్లే చేశారు. ఆ సమయంలో బన్నీ పక్కనే కూర్చుని ఉన్నా ప్రియా వారియర్ నేరుగా బన్నీకి గురిపెట్టి గన్ షాట్ పేల్చింది. ఈ దృశ్యం అక్కడున్న అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కన్నుగీటిన వీడియో, గన్ షాట్ వీడియో యూట్యూబ్ లో ఎలా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే.
ఆడియో వేడుకలో అల్లు అర్జున్ తన ప్రసంగంతో అలరించారు. బన్నీ మాట్లాడుతూ.. కొలవెరి సాంగ్ మొదలుకొని, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ప్రియా వారియర్ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ విషయాలు చాలా రోజులపాటు ట్రెండింగ్ లో నిలిచాయని బన్నీ తెలిపాడు.
ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ వైరల్ వీడియోల వలనే ఈ చిత్రానికి ఇంత బజ్ ఏర్పడిందని బన్నీ తెలిపాడు. పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసి మార్కెట్ చేయడం గొప్పేమి కాదు. అంతా కొత్తవాళ్లతో సినిమా చేసి ఈ స్థాయిలో బిజినెస్ చేయడం నిజంగా గొప్ప విషయం అని బన్నీ తెలిపాడు. ఆ విషయంలో ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులుని బన్నీ అభినందించాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







