మరో వీరప్పన్ తెలుగు థియేటర్లలో పోటీకి రెడీ ..
- December 26, 2015
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కిల్లింగ్ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఎలా చనిపోయాడు అన్న అంశాన్ని సినిమాగా తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాలో.. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ కు గురైన కన్నడ నటుడు రాజ్ కుమార్ తనయుడు హీరోగా నటించటంతో కిల్లింగ్ వీరప్పన్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో వీరప్పన్ తెలుగు థియేటర్లలో పోటీకి రెడీ అవుతున్నాడు. 2013లో యాక్షన్ స్టార్ అర్జున్, కిశోర్ ప్రధాన పాత్రల్లో వనయుద్ధం పేరుతో వీరప్పన్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు ఇదే సినిమాను వీరప్పన్ పేరుతో జనవరి 1న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ప్రచారం తమ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు వీరప్పన్ నిర్మాతలు. మరి ఈ ఇద్దరు వీరప్పన్ లలో తెలుగు ప్రేక్షకులను ఎవరు మెప్పిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







