తెలుగులోకి '96' మ్యూజిక్ డైరెక్టర్
- January 27, 2019
గత ఏడాది కోలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం 96 . విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా , ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్ర విజయం లో సంగీతం కూడా ఎంతో ప్రాణం పోసింది. గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం అందించడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లో రీమేక్ అవుతోంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రోల్ లో శర్వానంద్ నటిస్తుండగా, త్రిష రోల్ లో సమంత నటిస్తుంది. ఫిబ్రవరి నుండి ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. అయితే తెలుగు రీమేక్ కు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత నే సంగీతం అందించబోతున్నాడు. మొదటిసారి తెలుగు చిత్రానికి ఈయన మ్యూజిక్ అందిస్తుండడం తో అందరి చూపులు ఈయనపైనే ఉన్నాయి. మరి ఈయన అదృష్టం ఎలా ఉందొ..ఏ రేంజ్ లో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!