తెలుగు పాటకు దక్కిన గౌరవం

- January 27, 2019 , by Maagulf
తెలుగు పాటకు దక్కిన గౌరవం

తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా తనపై అభిమానం చూపిస్తున్న శ్రోతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. 1986లో కళాతపస్వి కె విశ్వనాథ్‌ రూపొందించిన సిరివెన్నెల చిత్రంతో పాటల రచయితగా పరిచయమయ్యారు సీతారామశాస్త్రి, తొలి చిత్రంలోని పాటలతో సంగీత ప్రపంచం ఉలిక్కి పడేలా చేశారు. విధాత తలపున ప్రభవించినదీ అంటూ ఆశ్చర్యపరిచే, ఆలోచింపజేసే సాహిత్యాన్ని సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్రతిహతంగా సీతారామశాస్త్రి పాటల ప్రస్థానం సాగుతోంది. తాజాగా పద్మశ్రీ పురస్కారం ఆయన్ను వరించింది. లక్షలాది మంది అభిమానం, ఆకాంక్షల వల్లే తనకు పద్మశ్రీ పురస్కారం దక్కిందన్నారు సిరివెన్నెల. పద్మశ్రీ పురస్కారం అందిన అనంతరం సిరివెన్నెల మాట్లాడుతూ.పద్మశ్రీ పురస్కారం తెలుగు పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ గౌరవం ఆత్రేయ, వేటూరి వంటి దిగ్గజ రచయితలు నాకు అందించిన ప్రసాదం. ఇన్నేళ్లుగా శ్రోతలు నాపై చూపిస్తున్న అభిమానం వల్లే ఇలాంటి గొప్ప పురస్కారాలు దక్కుతున్నాయి. పద్మశ్రీ పురస్కారం రచయితగా నాపై మరింత బాధ్యతను పెంచింది.

రచయితగా పరిశ్రమ నాకు మరో జీవితాన్ని ఇచ్చింది. సినిమా పాటల రచన నాకు ఊపిరి లాంటిది. అని చెప్పారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిని త్రివిక్రమ్‌ కుటుంబ సభ్యులు అభినందించారు.

పద్మశ్రీ ప్రకటన రోజునే సీతారామశాస్త్రి ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు మస్కట్‌ వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com