అగస్టావెస్ట్‌లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్‌కు క్రిస్టియన్ మైఖేల్ వచ్చాడు: యూఏఈ దౌత్యవేత్త
- January 30, 2019
అగస్టావెస్ట్‌లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియాడారు ఇండియాలో యూఏఈ దౌత్యవేత్త అహ్మద్ అల్ బన్నా. ఢిల్లీ-అబుదాభి ల మధ్య ఉన్న మంచి స్నేహంతోనే క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు అప్పగించగలిగామని అహ్మద్ తెలిపారు.
ఇరు దేశాల మద్య వ్యూహాత్మక బంధం బలపడటంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఒక ఏడాదిలోనో లేక ఒక్కరోజులోనో జరిగిపోవని చెప్పారు. గతేడాది డిసెంబరులో మైఖేల్‌ను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడం జరిగింది. అగస్టా వెస్ట్‌లాండ్ కేసును సీబీఐ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్లు విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి యూఏఈ భారత్‌ల మధ్య క్విడ్‌ప్రొకో వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి.
యూఏఈ ప్రధాని షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్టూమ్ కుమార్తె యువరాణి లతీఫాను గతేడాది మార్చిలో భారత్‌లోకి ప్రవేశించడంతో ఆమెను పట్టుకుని తిరిగి అబుదాబికి అప్పగించింది భారత్. అయితే భారత అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. అదే సమయంలో యూఏఈ కూడా భారత్ అబుదాబిల మధ్య బంధాలు బలపడ్డాయి. ఇలా మరే దేశంతోను అబుదాబి ఇంతటి మంచి సంబంధాలు కొనసాగించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







