నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కీలకమైన ఐ ఫోన్ లాక్..
- February 08, 2019
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఝాన్సీ ఆత్మహత్యకు కారణం ఏంటి? ఆత్మహత్యకు ప్రోత్సహించిన వారు ఎవరు? అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్నఝాన్సీ రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్ లాక్ కాగా.. అందులో ఉన్న మెసేజుల్లో కొన్ని ఆమె ప్రియుడు సూర్యతేజకు పంపి ఆ తరువాత డిలీట్ చేసినట్లుగా గుర్తించారు. డిలీట్ చేసిన మెసేజ్‌లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటులో తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో కీలకమైన మరో ఐ ఫోన్ లాక్ ఓపెన్ కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫోన్ లాక్ తెరుచుకోవడం లేదని పోలీసులు చెబుతున్నారు. లాక్ అయిన్ ఫోన్‌లో సమాచారం పెద్దగా లేకపోవడంతో…ఈ కేసు చిక్కుముడి విప్పేందుకు కష్టంగా మారింది.
సూర్యతేజ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఝాన్సీ అన్న దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కోణంలో దర్యాప్తు చేసినా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో సూర్యతేజపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐఫోన్ లాక్ తెరిస్తే ఈ కేసులో ఎన్నో కీలకమైన విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.
గతంలో కూడా ఝాన్సీ ఓ సారి ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఝాన్సీని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు సమాచారం. దీంతో ఆ కోణంలోనూ ఇన్విస్టిగేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







