క్యాప్సికం చట్నీ
- February 08, 2019
కావలసిన పదార్థాలు : క్యాప్సికం- అర కిలో, ఎండుమిరపకాయలు- 8, సెనగపప్పు- 8 చెంచాలు, మినపపప్పు- 6 చెంచాలు, ఆవాలు-4 చెంచాలు, మెంతులు- ఒకటిన్నర చెంచా, కరివేపాకు- ఒక రెబ్బ, నూనె- 8 చెంచాలు, పసుపు- అర చెంచా, చింతపండు- కుంకుడుకాయంత, ఉప్పు- తగినంత, ఇంగువ- అర చెంచా. పోపుని పొడి చేసి పెట్టుకోవాలి.
తయారీ విధానం : ఒక బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక ఒక చెంచా ఆవాలు, 4 చెంచాల సెనగపప్పు, 3 చెంచాల మినపపప్పు, 2 ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి వేరే పాత్రలోకి మార్చుకోవాలి. బాణలిలో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చల్లారిన తర్వాత పొడి చేసి ఉంచుకోవాలి. బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేయించి చల్లార్చాలి. తాలింపు పొడి ఇంకో భాగం, క్యాప్సికం ముక్కలు, నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి చట్నీ చేయాలి. దీనికి మొదట తయారు చేసిన తాలింపు కలిపితే రుచికరమైన క్యాప్సికం చట్నీ రెడీ. చివరిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా