కత్తితో బెదిరించి 15,00 కువైటీ దినార్స్‌ దోపిడీ

- February 09, 2019 , by Maagulf
కత్తితో బెదిరించి 15,00 కువైటీ దినార్స్‌ దోపిడీ

కువైట్‌ సిటీ: ప్రైవేట్‌ మనీ ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కత్తితో బెదిరించి, వారి నుంచి 15,000 కువైటీ దినార్స్‌ దోచుకున్న ఈజిప్టియన్‌ వలసదారుడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఫర్వానియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంస్థ తరఫున డబ్బుని ఓ చోట నుంచి మరో చోటకి వాహనంలో తరలించేందుకు బాధిత ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా, కత్తితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడికి యత్నించి, డబ్బు కలిగిన బ్యాగ్‌ని తీసుకుని పారిపోయాడు. పారిపోతున్న అతన్ని పట్టుకునేందుకు బాధిత ఉద్యోగులు పరుగులు పెట్టారు. మరోపక్క సెక్యూరిటీమెన్‌ అలర్ట్‌ అవడంతో, నిందితుడ్ని పట్టుకోగలిగారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com