చెన్నైలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 4.9 గా నమోదు
- February 12, 2019
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధానిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9 గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం బంగాళాఖాతంలో ఈ భూకంపం సంభివించింది. భూకంపం రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించలేదు.
ఇదిలా ఉంటే సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూంకపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటలకు కంపించినట్లు సమాచారం.ఇదిలా ఉంటే సునామీ వచ్చే అవకాశం లేదని భారత మెటియారాలాజికల్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. గతంలో కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో పలుమార్లు భూమి కంపించింది.
ఇక భూమి కంపించడంతో చెన్నై నగరవాసులు ఆ వార్త తెలిపేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించారు. టైడల్ పార్క్ దగ్గర భూమి కంపించడంతో పరుగులు తీశామని కొందరు ట్విటర్‌లో పోస్టు చేశారు. 2004లో వచ్చిన సునామీని తలపించిందని ఒకరు పోస్టు చేయగా మరొకరు 2002లో గుజరాత్‌లోని బుజ్‌లో సంభవించిన భారీ భూకంపం తలపించిందని మరొకరు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్