ఇండిగో, విస్తారా ఆఫర్.. రూ.899కే వస్తారా అంటూ..
- February 12, 2019
ఒకప్పుడు లగ్జరీ అనుకునే విమాన ప్రయాణం ఇప్పుడు దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణీకులను ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఇండిగో, విస్తారా ఎయిర్‌లైన్స్ డిస్కౌంట్ ధరలకు టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. పలు ప్రధాన రూట్లలో ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్, ఇండిగో ప్రకటించాయి.
ఇండిగో ఆఫర్
ఈనెల 12,13 తేదీల్లో టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి డిస్కౌంట్ ధర అందుబాటులో ఉంటుంది. ఈ రోజుల్లో టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఫిబ్రవరి 26 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.
విస్తారా ఆఫర్
విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాలంటే ఈనెల 12,13 తేదీల్లో టికెట్లను బుకింగ్ చేసుకున్నట్లైతే డిస్కౌంట్ పొందవచ్చని అంటోంది. ఇలా బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 27 నుంచి సెప్టెంబర్ 18 వరకు మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.
ఇండిగో, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండూ దేశీ విమాన టికెట్లను రూ.899కే అందిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ రూట్లలో టికెట్ ప్రారంభ ధర రూ.3,399గా ఉంది. విమానం ప్రయాణించే రూట్లు.. ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ- చెన్నై, ముంబై-గోవా వంటి పలు రూట్లలో ఈ రెండు సంస్థలు ఆఫర్లను ఇస్తున్నాయి.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







