సోషల్ మీడియాలో డిఫేమ్ చేస్తే 250,000 దిర్హామ్‌ల జరీమానా, జైలు
- February 12, 2019
ఎవరైనా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా, వారి ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడ్తాయి. ఆర్టికల్373 - ఫెడరల్ చట్టం 3, 1987 ప్రకారం ఈ చర్య నేరపూరితం. 10,000 దిర్హామ్‌ల జరీమానా, ఏడాది వరకు జైలు శిక్ష, ఉల్లంఘనులకు పడే అవకాశం వుంటుంది. బాధిత వ్యక్తి గనుక పబ్లిక్ అఫీషియల్ అయితే, ఈ చర్యలు మరింత కఠినంగా వుంటాయి. నిందితుడికి 20,000 దిర్హామ్‌ల జరీమానా, 2 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించవచ్చని చట్టం పేర్కొంటోంది. 'నిందారోపణలు - దూషణలు) న్యూస్ పేపర్ లేదా ప్రింట్ మీడియాలో ప్రచురితమైతే అగ్రావేటెడ్ కేస్‌గా పరిగణించబడ్తుంది. కంప్యూటర్ నెట్ వర్క్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దూషణలకు దిగితే మాత్రం 250,000 దిర్హామ్‌ల వరకు నిందితులు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జరీమానా 500,000 వరకూ చేరుకునే అవకాశం వుంటుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..